English   

చైసామ్..బ్యాక్ టూ హైదరాబాద్

 Naga Chaitanya Samantha
2020-11-30 20:23:19

వారం రోజుల వెకేషన్ తరవాత  సమంత నాగచైతన్య జంట మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు షూటింగ్ లేకుండా కాళీగా ఉన్న ఈ జంట షూటింగ్ లు మొదలు కాగానే బిజీ అయ్యారు. దాంతో కొంతకాలం సరదాగా గడిపేందుకు..అలాగే చైతన్య పుట్టిన రోజును కూడా ఎంజాయ్ చేసేందుకు మాల్దీవులకి వెళ్లారు. అక్కడ ఫుల్ గా చిల్ అయ్యారు. మాల్దీవుల్లో సమంత చిట్టి పొట్టి డ్రెస్సులతో హాట్ అందాలను ఆరబోసింది. దాంతో సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక చైతన్య పుట్టిన రోజును కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాడు. 

ఇద్దరే కలిసి ఉండటంతో కొత్తలోకంలో భాగా ఎంజాయ్ చేశారు. ఇక వెకేషన్ ముగించుకుని హైదరాబాద్ వచ్చారు. ఎయిర్పోర్ట్ లో చై సామ్ ఫోటోలు భయటకు వచ్చాయి. ఇక హైదరాబాద్ చేరుకున్న ఈ జంట మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అవ్వనున్నారు. చైతన్య చేతిలో ఇప్పటికే మూడు సినిమాలు ఉన్నాయి. అందులో లవ్ స్టోరీ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇక సమంత అయితే అటు సినిమాలు, ఇటు టీవీ షోలతో బిజీగా వుంది. ప్రస్తుతం సామ్ ఆహా లో "సామ్ జామ్" అనే ఓ షో చేస్తోంది. ఈ షోలో ఇప్పటికే రానా, విజయ్ దేవరకొండ సందడి చేశారు. ఇక  మెగాస్టార్ సైతం ఈ షోలో ఇంటర్వ్యూ ఇచ్చారు. కానీ ఇంకా అది టెలికాస్ట్ అవ్వలేదు.

More Related Stories