English   

ప్రభాస్ తో మరో సినిమా...క్లారిటీ ఇచ్చిన జక్కన్న

Prabhas SS Rajamouli
2020-12-01 12:08:59

ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాయి. ఛత్రపతి సినిమాతో ప్రభాస్ క్రేజ్ మరింత పెరగగా రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా మారారు. ఇంకా ఆ తరవాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాను జక్కన్న రెండు పార్టులుగా తెరకెక్కించారు. బాహబలి మొదటి పార్ట్ కి తెలుగులో యావరేజ్ టాక్ రాగా మిగతా భాషల్లో మాత్రం రికార్డులు బ్రేక్ చేసింది. ఇక బాహుబలి రెండో పార్ట్ తో ప్రభాస్ అన్ని భాషల సినీప్రియులకు డార్లింగ్ అయ్యాడు.

ఇదిలా ఉండగా ప్రభాస్..రాజమౌళి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ రెండు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రభాస్ నేను మళ్ళీ సినిమా చేస్తే ప్రజలు బాబోయ్ వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారని భయపడతారు అంటూ సరదాగా నవ్వుకుంటూ సమాధానం ఇచ్చారు. జోకులను పక్కన పెడితే..ప్రభాస్ తో పని చేయడం అంటే తనకు ఇష్టమని మంచి సబ్జెక్టు వస్తే కచ్చితంగా సినిమా చేస్తానని అన్నారు.  
 

More Related Stories