English   

నాకు డేటింగ్ చేయాలని ఉంది..రాశీఖన్నా షాకింగ్ కామెంట్స్

 Raashi Khanna
2020-12-01 12:23:17

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రాశీఖన్నా. ఈ సినిమాలో రాశీ నటనకు మంచి మార్కులు పడటంతో వరుస ఆఫర్లను దక్కించుకుని ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. వయ్యారాలు వలక బోయడంతో పాటు రాశీ తన పాత్రకు తగ్గట్టుగా నటించడంలోనూ దిట్ట అనే చెప్పవచ్చు. ఇక టాలీవుడ్ లోనే కాకుండా ఈ భామ ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది. ఇదిలా ఉండగా రాశీ ఖన్నా చాలా గడసరి కూడా..ఎక్కడ ఏం మాట్లాడాలో.. ఏం మాట్లాడకూడదో ఈ అమ్మడికి బాగా తెలుసు అందుకే ఆచి తూచి మాట్లాడుతుంది. ఇక తాజాగా ఈ భామ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది.

 ప్రేమ అంటే ఎక్కువగా విఫలమవుతుందని..ప్రేమలో ఎక్కువగా పరాజయాలే ఉంటాయని గతంలో రాశీఖన్నా అనేక సందర్భాల్లో చెప్పింది. కాగా తాజాగా తన స్కూల్ డేస్ లో సీనియర్ ను ప్రేమించాను అని. కొన్ని కారణాల వల్ల ఇద్దరం విడిపోవాల్సి వచ్చిందని తెలిపింది. మారి ఇప్పుడు ఎవరితో అయినా ప్రేమలో ఉన్నారా అని రాశిని ప్రశ్నించగా... "నేను ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నా..నా జీవితంలో ఎవరూ లేరు. నిజం చెప్పాలంటే నాకు ఎవరితో అయినా డేటింగ్ చేయాలని ఉంది. ఆ అనుభవం ఎలా ఉంటుందో ఆశవాదించాలని ఉంది. కానీ ఎందుకో ఆ వైపు వెళ్లలేకపోతున్నా " అంటూ రాశి చెప్పుకొచ్చింది. మొత్తానికి రాశీ మనసులో ఏమీ దాసుకోకుండా ఉన్నదంతా బయటకి కక్కేసింది. మరి ఈ అమ్మడిని డేటింగ్ కి తీసుకెళ్లే ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి.

More Related Stories