English   

మహేష్ బాబు ముందడుగు.. గెట్ రెడీ టూ యాక్షన్..

 AMB Cinemas
2020-12-01 13:00:05

దాదాపు ఏడు నెలలుగా తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు మూతపడి ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అయితే అనుమతులు వచ్చిన తర్వాత కూడా తెరవడానికి ఎగ్జిబిటర్లు మనస్కరించలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో  థియేటర్లు తెరవడం కంటే అలాగే మూతపెట్టి ఉండటం నయమని ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎవరో ఒకరు ఈ విషయంలో ముందడుగు అయితే వెయ్యాలి కదా. ఇప్పుడు మహేష్ బాబు ఆ అడుగు వేస్తున్నాడు. ఈయనకు సంబంధించిన ఏఎంబి థియేటర్స్ డిసెంబర్ 4 నుంచి ఓపెన్ కానున్నాయి. ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు మహేష్ బాబు. గెట్ రెడీ టూ యాక్షన్ ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. డిసెంబర్ 4 నుంచి ఏఎంబి థియేటర్ ఓపెన్ అవుతుంది.. ఇక్కడ యాక్షన్ మొదలైంది అంటూ దీని అర్థం. అయితే ఈయన బాటలోనే మిగిలిన వాళ్ళు కూడా నడుస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే సిటీలో ఇంకా చాలా థియేటర్స్ అలాగే మూతబడి ఉన్నాయి. కరోనా దెబ్బకు థియేటర్లు శాశ్వతంగా మూత పడిపోయాయి.  ఇప్పట్లో వాటిని తెరవడానికి ఎగ్జిబిటర్లు ముందుకు రావడం లేదు. సినిమాలు లేవు కాబట్టి థియేటర్లు తెరిచినా లాభం ఉండదని వాళ్ల అభిప్రాయం. డిసెంబర్ 25న సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన రిలీజ్ పోస్టర్ కూడా విడుదలైంది. దీంతో పాటు సుమంత్ నటించిన కపటదారి సినిమా కూడా డిసెంబర్ 25న రానుంది. ఈ రెండు సినిమాలు థియేటర్స్ కు పునర్వైభవం తీసుకు వస్తాయని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. వీటి రిలీజ్ కోసం అభిమానుల కంటే కూడా ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ సినిమాలకు వచ్చే రెస్పాన్స్ ని బట్టి మిగిలిన సినిమాల విడుదల చేయాలా వద్దా అని నిర్ణయించుకోనున్నారు. ఏదైనా మహేష్ బాబు ఏఏంబి సినిమాస్ మాత్రం డిసెంబర్ 4 నుంచి ఓపెన్ అవుతున్నాయి. మరి ఈయన నిర్ణయం సరైందా కాదా అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది. 

More Related Stories