English   

శివసేన గూటికి నటి ఊర్మిళ

Urmila Matondkar
2020-12-02 10:59:52

బాలీవుడ్ నటి ఊర్మిళ శివసేన గూటికి చేరారు. గత కొద్దిరోజులుగా ఊర్మిళ శివసేన లో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా ఆ వార్తలకు తెరదించి ఆమె మహారాష్ట్ర  ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో పార్టీలో చేరారు. ముంబై లోని పార్టీ కార్యాలయంలో ఊర్మిళ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక గతంలో ఊర్మిళ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు.  కాంగ్రెస్ నుండి ఆమె లోక్ సభ ఎన్నికల బరిలో కూడా దిగారు. అయితే ఎన్నికల్లో ఓటమి ఓటమి పాలయ్యాక పార్టీకి దూరంగా ఉన్నారు. ఇక తాజగా మళ్ళీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేందుకు శివసేనలో చేరారు. మరోవైపు గవర్నర్ కోటాలో ఊర్మిళకు ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు హర్షల్ ప్రధాన్ తెలిపినట్టు ఓ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది.

More Related Stories