English   

మిడిల్ క్లాస్ భామకు ఆఫర్లు క్యూ కడుతున్నాయట

 Varsha Bollamma
2020-12-02 11:15:40

2018లో వచ్చిన తమిళ సినిమా "96" తో పాపులారిటీని సంపాదించిన నటి వర్ష బొల్లమ్మ. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి స్టూడెంట్ ఫోటో గ్రాఫర్ గా కనిపించిన వర్ష పెద్ద పెద్ద కళ్ళతో కుర్రకారుని తనవైపు తిప్పుకుంది. ఇక ఆ తరవాత విజయ్ "బీగిల్" సినిమాలో కనిపించి అలరించింది. దాంతో 96 రీమెక్ గా వచ్చిన " జాను " సినిమాలోను నటించి వర్ష తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తరవాత "చూసి చూడంగానే" అనే చిత్రంలో హీరోయిన్ గా పరిచయం అయింది. 

ఈ సినిమా వర్షకు పెద్దగా పేరు తీసుకురాలేదు. కానీ ఇటీవల విడుదలైన "మిడిల్ క్లాస్ మెలోడీస్" సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో వర్షకు క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవర కొండ హీరోగా నటించాడు. ఓటీటీ లో విడుదలైన మిడిల్ క్లాస్ మెలోడీస్ కు హిట్ టాక్ రావడంతో వర్షకు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. ప్రస్తుతం ఈ భామ రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న "స్టాండప్ రాహుల్" సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా మరికొన్ని సినిమాలకు కూడా వర్ష సైన్ చేసినట్టు టాక్.

More Related Stories