English   

ఏంటి ప్రభాస్ ఒక్కో సినిమా కోసం అంత తీసుకుంటున్నాడా..

Hero Prabhas
2020-12-02 19:26:44

బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాల కోసం ఇండియన్ సినిమా అంతా వేచి చూస్తుంది. ఈయన సినిమాకు ఇప్పుడు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా క్రేజ్ భారీగానే ఉంది. మార్కెట్ రూపంలో కూడా అది కనిపిస్తుండటంతో ఈయనకు ఎంత కావాలంటే అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు. బాహుబలి కోసం అప్పట్లో 60 కోట్లకు పైగా పారితోషికం అందుకుని సంచలనం సృష్టించిన ప్రభాస్.. ఆ తర్వాత సాహో కోసం కూడా ఆస్తులు రాయించుకున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 100 కోట్ల వరకు తీసుకున్నాడని ప్రచారం జరిగింది. ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలోనే ఎవరూ అందుకోనంత భారీ రెమ్యునరేషన్ ఇది. ఇప్పుడు కూడా నాగ్ అశ్విన్ సినిమా కోసం ప్రభాస్ మరోసారి భారీ పారితోషికమే అందుకోబోతున్నాడు. ఈ చిత్రం కోసం ఏకంగా 300 కోట్లు బడ్జెట్ ప్రణాళిక వేసుకుంటున్నారు స్వప్న సినిమా. అశ్వినీదత్ అయితే ఏకంగా 400 కోట్లు చెప్తున్నాడు. 

మహానటి తర్వాత వాళ్లేం సినిమాలు చేయలేదు.. ఇప్పుడు ఇదే చేయబోతున్నారు. టైమ్ మిషన్ కాన్సెప్టుతో ప్రభాస్ సినిమా వస్తుందని తెలుస్తుంది. దానికి తగ్గట్లుగానే బిజినెస్ కూడా జరుగుతుందని వాళ్లు నమ్ముతున్నారు. ప్రభాస్ సినిమా అంటే కచ్చితంగా తెలుగు, తమిళ, హిందీలో కలిపి ఈజీగా 300 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని అశ్వినీదత్ కూతుర్లు అంచనాలు వేసుకుంటున్నారు. పైగా విడుదలైన తర్వాత లాభాల్లోనూ ప్రభాస్ వాటా తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అగ్రిమెంట్ కూడా పూర్తైపోయిందనే ప్రచారం జరుగుతుంది. 

ఇదే కానీ నిజమైతే మాత్రం అదో సంచలనమే. ఈ సినిమాతో పాటు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా కూడా చేస్తున్నాడు ప్రభాస్. దీనికోసం కూడా భారీగానే అందుకుంటున్నాడు ప్రభాస్. అంతేకాదు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఓ ప్యాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఇవన్నీ ఇంకా సెట్స్ పైకి రాలేదు కానీ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ రాధే శ్యామ్ సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్.. వచ్చే ఏడాది చివర్లో నాగ్ అశ్విన్ సినిమాపై ఫోకస్ చేయనున్నాడు. జనవరి నుంచి ఓం రౌత్ ఆదిపురుష్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా కాదు ఏకంగా పాన్ వరల్డ్ గా తెరకెక్కిస్తానని చెబుతున్నాడు ఓం రౌత్. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..?

More Related Stories