English   

కొత్త పార్టీపై తలైవా కీలక ప్రకటన

Rajinikanth
2020-12-03 14:25:09

సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు కొత్త రాజకీయ పార్టీ పై కీలక ప్రకటన చేశారు. అభిమాన సంఘాలతో చర్చల అనంతరం ఆయన పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. తమిళనాట జనవరిలో పార్టీ పెడుతున్నట్టు స్పష్టం చేశారు. అంతేకాకుండా 2021 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు పేర్కొన్నారు. డిసెంబర్ 31న పార్టీకి సంబంధించి అన్ని వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఇక తమ అభిమాన హీరో పార్టీ పెడుతుండటంతో రజినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్టార్ కాబోయే సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు.

 ఇదిలా ఉండగా మూడేళ్ళ క్రితమే రజినీ కాంత్ కొత్త పార్టీ పెడతా అంటూ ప్రకటన చేసారు. కానీ పార్టీ పేరును గానీ..తేదీని గాని ప్రకటించలేదు. గత ఎన్నికల సమయంలో కూడా రజినీకాంత్ పార్టీ పెట్టి ఎన్నికల భరిలో దిగుతారని అభిమానులు ఆశించారు. కానీ ఆయన వేరే పార్టీకి మద్దతు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూడా రజినీకాంత్ బీజేపీ కి మద్దతు ఇవ్వనున్నారని ప్రచారం జరిగింది. దాంతో ఆయన అభిమానులతో సమావేశమయ్యారు. సమావేశంలో కూడా అభిమానులు బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇక తాజాగా రజినీకాంత్ పార్టీ పేరును ప్రకటిస్తానని..ఎన్నికల బరిలో దిగుతానని చెప్పడం అభిమానుల్లో జోష్ నింపింది. మరి కొత్త పార్టీ పెట్టిన తరవాత తలైవా సక్సెస్ అవుతారా లేదా అన్నది చూడాలి.

More Related Stories