English   

రైటర్ గా దిల్ రాజు భార్య..ఇక డోకా లేనట్టే

Dil Raju Wife Tejaswini
2020-12-03 15:17:58

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొన్నేళ్ల కిందట తన భార్య మృతి చెందడంతో ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ లో అతికొద్దిమంది సమక్షంలో దిల్ రాజు పెళ్లి చేసుకున్నారు. ఆ ఆతరవత భార్యతో కలిసి దిల్ రాజు తిరుపతి వెళ్లిన ఫోటోలు, పూజలు చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో దిల్ రాజు భార్యగా ఆమె ఫేమస్ అయ్యారు. ఇక తాజాగా దిల్ రాజు భార్య గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ఆమె రైటర్ అవతారం ఎత్తబోతున్నారని ఫిల్మ్ నగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది. 

ఇప్పటికే ఆమె ఓ స్టోరీ లైన్ ను దిల్ రాజుకు వినిపించారట. ఆ పాయింట్ దిల్ రాజుకు తెగ నచ్చడంతో ఆయన కొంతమంది రైటర్స్ ను పెట్టి ఆ స్టోరీని డెవలప్ చేయించే పనిలో ఉన్నారట. ఇక దిల్ రాజు భార్య గనక స్టోరీ రెడీ చేస్తే సినిమా తెరకెక్కడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక మరోవైపు ఇండస్ట్రీలో మంచి రైటర్ ల కొరత కూడా బాగానే ఉంది. కొత్త కొత్త కథలు వస్తే తప్ప సినిమాలు హిట్ అవ్వడం లేదు. రొటీన్ గా తీసే లవ్ స్టొరీ సినిమాలు, యాక్షన్ సినిమాలంటే ప్రేక్షకులు ముఖం చాటేస్తున్నారు. కొత్త స్టోరీలకు జై కొడుతున్నారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు భార్య ఎలాంటి స్టోరీతో వస్తుందో చూడాలి.

More Related Stories