English   

కరోనా రూల్స్ పాటించడంలో సుక్కు ఫెయిల్ అయ్యాడా

puspha
2020-12-04 12:53:54

కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేంద్రం సినిమా షూటింగ్ ల కు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో బ్రేక్ పడిన అన్ని సినిమా షూటింగ్ లు తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్ లు పూర్తి చేయాలని కేంద్రం నిబంధనలు అమలు చేసింది. షూటింగ్ సమయంలో శానిటేషన్ చేయడం మాస్కులు ధరించడం లాంటి నిబంధనలు పాటించాలని అదేశించింది. దాంతో నిబంధనలు పాటిస్తూ షూటింగ్ లు జరుపుతున్నారు. ఇక ఎన్ని నిబంధనలు పాటించినప్పటికి కరోనా ముప్పు తప్పడం లేదు.

 ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పుష్ప" సినిమా   తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మారేడ్పల్లి అడవుల్లో జరుగుతోంది. 800 మందితో షూటింగ్ జరుపుతున్నారు. కాగా పుష్ప టీంలో 12 మందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. దాంతో సుక్కు షూటింగ్ కు బ్రేక్ చెప్పారు. ఈ నేపథ్యంలో సుకుమార్ నిబంధనలు పాటించడంలో విఫలమయ్యారా అనే అనుమానం వస్తోంది. మరోవైపు పుష్ప కంటే ముందే షూటింగ్ ప్రారంభించిన జక్కన్న మాత్రం "ఆర్ఆర్ఆర్" షూటింగ్ ను బ్రేక్ ఇవ్వకుండా కొనసాగిస్తున్నారు.

More Related Stories