English   

మహేష్ బాబును నమ్ముకుని ఎటూ కాకుండా పోయాడుగా..

 Vamshi Paidipally
2020-12-05 12:14:38

8 నెలల కింది వరకు కూడా చేతిలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఉందనే ధైర్యంతో కనిపించిన దర్శకుడు వంశీ పైడిపల్లి కొన్ని రోజులుగా డీలా పడిపోయాడు. ఉన్నట్లుండి ఈ చిత్రం ఆగిపోవడంతో ఏం చేయాలో తెలియక డైలమాలో పడిపోయాడు ఈ దర్శకుడు. లూసిఫర్ రీమేక్ బాధ్యతలు తీసుకుంటాడని వార్తలు వినిపించినా కూడా ఇప్పుడు ఆ అవకాశం తమిళ దర్శకుడు జయం రాజాకు ఇచ్చాడు మెగాస్టార్. ఉన్నట్టుండి మహేష్ బాబు సినిమా చేజారిపోవడం.. అనుకున్న చిరంజీవి సినిమా మరో దర్శకుడికి వెళ్ళిపోవడంతో వంశీ పైడిపల్లి ఒక్కసారిగా ఖాళీ అయిపోయాడు. ఇప్పటికిప్పుడు ఓ కథ సిద్ధం చేసుకొని ఎవరో ఒక హీరో ఒప్పించే పనిలో బిజీ అయిపోయాడు ఈ దర్శకుడు. అయితే వంశీ పైడిపల్లి చెప్పే కథలు వినడానికి స్టార్ హీరోలు కూడా ఎవరూ కాళీగా లేరు.

జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే త్రివిక్రమ్ సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చాడు. అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కూడా బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ ఒక్కడే నెక్స్ట్ ఏంటో తెలియకుండా ఉన్నాడు. దాంతో ఆయన్నే ఎలాగైనా పట్టాలని చూస్తున్నాడు వంశీ పైడిపల్లి. అనుకున్నట్లుగానే ఇప్పుడు రామ్ చరణ్ ను పట్టేసాడు వంశీ పైడిపల్లి. ట్రిపుల్ ఆర్, ఆచార్య సినిమాల తర్వాత వంశీతో సినిమా చేయడానికి రామ్ చరణ్ ఓకే చెప్పేసాడని తెలుస్తుంది. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన ఎవడు సినిమా విజయం సాధించింది.

ఆ పరిచయంతోనే రామ్ చరణ్ వైపు వంశీ అడుగులు పడుతున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. మరో రెండు మూడేళ్ల వరకు రామ్ చరణ్ బిజీగా ఉండటంతో వంశీ సినిమా ఇప్పట్లో వర్కౌట్ అవుతుందా లేదా అనేది అర్థం కావడం లేదు. మరోవైపు తన స్థాయి తగ్గించుకొని ఒక మెట్టు దిగి సెకండ్ గ్రేడ్ హీరోలతో సినిమాలు చేయాలని వంశీ ప్లాన్ చేస్తున్నాడు. కానీ నితిన్, రామ్, విజయ్ దేవరకొండ, నాని లాంటి హీరోలు కూడా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. దాంతో పాపం వంశీ పైడిపల్లి పరిస్థితి ఎటూ కాకుండా అయిపోతుంది.  అందుకే ఇప్పుడు తన మనసు మార్చుకుని వెబ్ సిరీస్ చేయడానికి ముందుకొచ్చాడు వంశీ పైడిపల్లి. అల్లు అరవింద్ ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నాడు ఈ దర్శకుడు.

More Related Stories