తమిళ సినిమాల్లోకి రంగమ్మత్త

తెలుగులో టాప్ యాంకర్స్ లో ఒకరు అనసూయ బరధ్వాజ్. మొదట న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ హాట్ భామ తెలుగు టీవీ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ షోతో జబర్దస్త్ బ్యూటీ అని పేరు తెచ్చుకుంది. ఇక ఆ తరవాత అనసూయ వరుస ఆఫర్ లతో అటు టీవీ షోలలో ఇటు సినిమాల్లో బిజీగా మారింది. రంగస్థలం సినిమాలో అనసూయ రంగమ్మత్త పాత్రలో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాతో మంచి నటిగా అనసూయకు గుర్తింపు వచ్చింది. ఇదిలా ఉండగా తెలుగులో ఎంతో పాపులర్ అయ్యిన అనసూయ ఇప్పుడు కోలీవుడ్ లోనూ ఛాన్స్ కొట్టేసింది.
కోలీవుడ్ లో అనసూయ తన మొదటి సినిమాకు ఒకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమాలో అనసూయ బోల్డ్ పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సినిమాకు సంబంధించి అనసూయ కూడా ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పోస్ట్ లో ఓ మంచి కథతో ప్రయాణం అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ సినిమాలో అనసూయ సిల్క్ స్మిత పాత్రలో నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. సిల్క్ స్మిత పాత్రలో అనసూయ నటించడం నిజానికి ఛాలెంజింగ్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో అనసూయ మెప్పించగలిగితే ఈ అమ్మడికి అక్కడ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ప్రస్తుతం తెలుగులో అనసూయ ...రవితేజ "ఖిలాడి" తో పాటు కృష్ణ వంశీ డైరెక్షన్ లో వస్తున్న రంగమార్తాండ సినిమాలోనూ నటిస్తోంది.