English   

పెళ్లికి ముస్తాబవుతున్న మెగాడాటర్

Niharika Chaitanya
2020-12-05 23:20:49

మెగాడాటర్ నిహారిక కొణిదెల వివాహం గుంటూరు ఐజీ కుమారుడు చైతన్య తో నిశ్చయమైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 9న వీరి వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా జరగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబందించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నాగబాబు దంపతులు బంధువులకు సంబందించిన వ్యవహారం చేసుకోగా..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చెల్లెలి పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు.  

ఇక మరో రెండు రోజుల్లో మెగా ఫ్యామిలీ అంతా ఉదయ్ పూర్ కు చేరుకోనుంది. అక్కడ మెహందీ, సంగీత్ కార్యక్రమాలలో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉండగా కొద్దిరోజుకుగా నిహారిక ప్రీవెడ్డింగ్ సెలెబ్రేషన్స్ జరుగుతుండగా దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా నిహారికను పెళ్లి కూతురిగా చేసే కార్యక్రమానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన మెగా అభిమానులు, నెటిజన్లు నిహారికను పెళ్లి కళ వచ్చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

More Related Stories