English   

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ

Hari Teja
2020-12-05 17:01:13

ప్రముఖ యాంకర్, నటి హరితేజ త్వరలో తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని హరితేజనే తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తల్లి కాబోతున్న విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో హరితేజ ఓ వీడియోను పోస్ట్ చేసింది. తాను త్వరలోనే తల్లి కాబోతున్న అని చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం హరితేజ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె అభిమానులు, నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. 

ఇదిలా ఉండగా హరితేజ మొదట్లో సీరియల్ నటిగా ఎంట్రీ ఇచ్చి యాంకరింగ్ లోకి అడుగుపెట్టింది. యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరవాత ఆమెకు బిగ్ బాస్ లో అవకాశం రావడంతో పాపులర్ అయింది. బిగ్ బాస్ లో హరితేజ దాదాపు ఫైనల్ వరకు చేరుకుంది. హౌస్ మేట్స్ కు పోటీ ఇచ్చి భయట అభిమానులను సంపాదించుకుంది. ఇక సినిమాల పరంగా చూసుకుంటే అ..ఆ సినిమాతో హరితేజ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక లాక్ డౌన్ కాలంలో హరితేజ షూటింగ్ లకు దూరమయ్యి ప్రస్తుతం ఇంటికే పరిమితమైంది. 

More Related Stories