English   

బాలయ్య కొత్త సినిమా టైటిల్ అదిరిపోయిందిగా..

Balakrishna
2020-12-05 17:46:56

ఈ రోజుల్లో సినిమాపై ఆసక్తి పెంచేది టైటిల్. అది కానీ బాగా కుదిరింది అంటే సినిమాపై అంచనాలు కూడా అలాగే ఉంటాయి. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు టైటిల్స్ అనేది చాలా ముఖ్యం. వాళ్ల ఇమేజ్ కు సరిపోయేలా టైటిల్ పెట్టాల్సి ఉంటుంది. అందులోనూ బాలకృష్ణ లాంటి మాస్ హీరో సినిమాకు టైటిల్ ఎలా ఉండాలి.. వాళ్ళ అభిమానులు ఏ రేంజ్ లో ఊహిస్తారు.. అందుకే బాలయ్య సినిమాలకు టైటిల్స్ పెట్టాలంటే దర్శక నిర్మాతలకు తల ప్రాణం తోకలోకి వస్తుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఇప్పటి వరకు టైటిల్ పెట్టలేదు. దీనికి మోనార్క్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో బాలయ్య పాత్ర కూడా అలాగే ఉంటుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే బోయపాటి తర్వాత మరో రెండు సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చాడు బాలకృష్ణ. అందులో ఒకటి కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో నాగ శౌర్య హీరోగా నటిస్తుండగా.. బాలయ్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. 8 ఏళ్ళ కింద మంచు మనోజ్ హీరోగా వచ్చిన ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాలో ఇలాగే ఒక గెస్ట్ రోల్ చేశాడు బాలకృష్ణ. ఇప్పుడు మళ్లీ నాగశౌర్య సినిమాలో అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను బాలయ్యకు అత్యంత సన్నిహితుడైన సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఆయన కోసం అతిథి పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు బాలకృష్ణ. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఈ సినిమాకు బలరామయ్య బరిలోకి దిగితే.. అనే పవర్ ఫుల్ టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఇందులో బలరామయ్య పాత్రలో నటించబోతున్నాడు బాలకృష్ణ. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అల్లుడు అదుర్స్ సినిమా చేస్తున్నాడు సంతోష్ శ్రీనివాస్. ఈ సినిమా తర్వాత బాలయ్య సినిమా ఉండబోతుంది. ఏదేమైనా బలరామయ్య బరిలోకి దిగితే.. ఏం జరుగుతుందో చూడాలి మరి. 

More Related Stories