English   

బిగ్ బాస్ అవినాష్ చాప్టర్ క్లోజ్.. భయమే కొంప ముంచిందా..

Avinash
2020-12-06 08:31:54

చూస్తుండగానే బిగ్ బాస్ 13 వారం కూడా చివరి దశకు వచ్చేసింది. ఈ వారం ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్తారు అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ బాగానే జరుగుతుంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ వారం నామినేషన్స్ లో ఉన్న అభిజిత్, అఖిల్, హారిక ఈ ముగ్గురు ఈజీగా సేవ్ అయిపోతారు. ఓట్లు కూడా భారీగా పడుతున్నాయి. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఓటు పడుతున్న తీరు కూడా అలాగే ఉంది అందరికంటే ముందు అభిజిత్ దూసుకుపోతున్నాడు. ఆయన తర్వాత అఖిల్, హారిక ఉన్నారు. ఇక నాలుగో స్థానంలో మోనాల్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈమెకు కూడా ఓట్లు బాగానే పడుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్ నుంచి ఈమె కోసం ఓట్లు భారీగా పడుతున్నాయని ప్రచారం జరుగుతుంది. తమ రాష్ట్రం అమ్మాయి కోసం అక్కడ ఏకంగా న్యూస్ ఛానల్స్ లో ప్రమోషన్ చేస్తున్నారు. డిబేట్ లు పెట్టి తెలుగు బిగ్బాస్ గురించి చెబుతున్నారు.

తమ రాష్ట్రం నుంచి వెళ్లిన అమ్మాయి మరో భాషలో 90 రోజుల నుంచి ఉంది అంటే ఎంత బాగా ఆడుతుందో అర్థం చేసుకోండి అంటూ మోనాల్ గురించి సోషల్ మీడియాలో గుజరాతీలు ప్రమోషన్ చేస్తున్నారు. అందుకే ప్రతి వారం ఈమె సేవ్ అవుతూ వస్తుంది. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఈ వారం అవినాష్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు అని తెలుస్తుంది. నిజానికి ఆయన గత వారం ఎలిమినేట్ అయిన కూడా బిగ్ బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో బయటపడ్డాడు. కానీ ఈ వారం అలాంటిది ఏమీ ఉండవని.. అవినాష్ ఇంటికి వెళ్లి పోవడం ఖాయం అని వార్తలు వినిపిస్తున్నాయి. పైగా ఈయన వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి విజేత కాలేడని ముందు నుంచి ప్రచారం అయితే భారీగానే జరుగుతుంది. గత రెండు వారాలుగా అవినాష్ ప్రవర్తన కూడా కాస్త విచిత్రంగా ఉంది. ఇది కూడా ఆయన గ్రాఫ్ కిందపడిపోయేలా చేసింది. 

More Related Stories