English   

మీడియా ఆ వీడియో క్లిప్ వేసి నన్ను బద్నామ్ చేసింది.. చిరంజీవి

Chiranjeevi
2020-12-07 10:43:25

కోవిడ్ సమయంలో సేవలు అందించిన వారికి "కోవిడ్ వారియర్స్ " పేరుతో అవార్డులు ప్రధానం చేసారు. కార్యక్రమంలో డాక్టర్లు, పొలిసు అధికారులు, సోషల్ వర్కర్స్ కు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సంధర్భంగా చిరు మాట్లాడుతూ... తనను అతిథిగా పిలిచినందుకు ఆనందం వ్యక్తం చేసారు. కార్యక్రమానికి వచ్చే ముందు తాను హీరో అనుకున్నన్నాని..కరోనా సమయంలో సహాయం చేసిన ఫ్రాంట్ లైన్ వారియర్స్ నిజమైన హీరోలని అన్నారు. ప్రతి వంద సంవత్సరాలకి ఒక మహమ్మారి వచ్చిందని సార్స్ , ప్లేగు వంటివి వచ్చి మిలియన్ల మంది మరణించారని అన్నారు. కానీ కోవిడ్ సమయంలో 1 నుండి ఒకట్టిన్నర శాతం మంది మాత్రమే చనిపోయారని అన్నారు.  ఇంత పెద్ద మహమ్మారి వచ్చినా  ప్రపంచ జనాభాలో చాలా తక్కువ శాతం మరణించడానికి కారణం కరోనా వారియర్స్ అని చెప్పారు. కరోనా వారియర్స్ సేవలను కొనియాడారు. పాండమిక్ సమయంలో ప్రతి ఒక్కరూ ఎంతో కస్టపడి సేవలు అందించారని అన్నారు.

 గాంధీ ఆస్పత్రిలో డాక్టర్లు అందించిన సేవలు మరువలేనివని చెప్పారు. కరోనా అవేర్ నెస్ కోసం తీసిన యాడ్  లో నటించిన నటి ఇషా రెబ్బా ను అభినందించారు. యాంకర్ రష్మీ సైతం కరొనకు భయపడకుండా బయటకు వచ్చి కార్యక్రమాలు చేసిందని అన్నారు. జంతువులకు ఆహరం అందించిందని అన్నారు. మనుషుల అహంకారాన్ని తగ్గించడానికి దేవుడు ఈ మహమ్మారిని రప్పించాడని అన్నారు. ప్రకృతిని మనిషి దురాశకు వినియోగించుకుంటున్నాడనే భగవంతుడు మహమ్మారిని తీసుకువచ్చాడని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిరు జోకులు పేల్చారు. 12 సంవత్సరక్రితం ప్రజా అంకిత యాత్ర చేస్తున్న క్రమంలో బస్సులో ప్రయాణించానని ఆ సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఫ్యాన్స్ ను కలిసిన తరవాత ఖర్జూర లు తినడానికి  శానిటైజర్ రాసుకున్నాని అన్నారు. దాంతో మీడియా వాళ్ళు ఫ్యాన్స్ కు షేక్ హ్యాండ్ ఇచ్చింది..శానిటైజర్ రాసుకున్న క్లిప్స్ ఎడిట్ చేసి వేశారని అన్నారు. ఖర్జూరాలు తినడానికి శానిటైజర్ రాసుకుంటే ఫ్యాన్స్ కు షేక్ హ్యాండ్ ఇచ్చినందుకు రాసుకున్నట్టు రాసారని అన్నారు. ఇక ఆయనకు మొదట కరోనా పాజిటివ్ వచ్చిందని డౌట్ వచ్చి మరో మూడు సార్లు టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వచ్చిందని చెప్పారు.  

More Related Stories