English   

సింగర్ సునిత ఎంగేజ్మెంట్..వరుడు ఎవరంటే..

Singer Sunitha
2020-12-07 11:36:09

సింగర్ సునిత రెండోపెళ్లి పై గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో సునిత రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు రాగా ఆమె ఆ వార్తలను కండించింది. కమెడియన్ అలీతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునిత తనకు రెండో పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయని కానీ అవి నిజం కాదని చెప్పింది. తన గురించి తన ఫ్యామిలీకి తెలుసు అని ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పింది. అంతే కాకుండా తనకు చిన్న వయసులోనే పెళ్లి జరిగిందని ఒక కూతురు, కుమారుడు ఉన్నారని పేర్కొంది. భర్త ప్రవర్తన నచ్చకపోవడంతోనే విడాకులు తీసుకున్నట్టు తెలిపింది. 

అప్పటినుండి కొన్నేళ్లుగా తాను ఒంటరిగానే ఉంటున్నా అని స్పష్టం చేసింది. ఇక ఇప్పుడు మళ్లీ సునీత పెళ్లి పై కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నా తాను స్పందిచలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం నేడు ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఛైర్మెన్ శ్రీరామ్ అనే వ్యక్తితో సునీత ఎంగేగ్మెంట్ జరిగినట్టు తెలుస్తోంది. సునిత పెళ్లిపై కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు ఈ వయసులో పెళ్లి అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎవరేం అనుకున్నా మొత్తానికి సునీత రెండో వివాహం చేసుకోవడంపై ఆమె అభిమానులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన గాయానికి శుభాకాంక్షలు చెబుతున్నారు. 

More Related Stories