English   

ఉదయ్ పూర్ బయలుదేరిన నిహారిక ఫ్యామిలీ

Niharika Konidela
2020-12-07 12:23:16

మెగాడాటర్ నిహారిక వివాహం గుంటూరు ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డ తో నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఈనెల 7న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వీరి వివాహం జరగనుంది. డిసెంబర్ 7న రాత్రి 7:15కు ముహూర్తం నిశ్చయమైంది. 8:30 నిమిషాలకు రిసెప్షన్ జరగనుంది. కాగా ఇప్పటికే ప్రీవెడ్డింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న నిహారిక, చైతన్య కుటుంబాలు రాజస్థాన్ కు బయలు దేరాయి. ఓ ప్రైవేట్ ఫ్లైట్ లో వీరు రాజస్థాన్ కు భయలుదేరినట్టు కనిపిస్తోంది. రెండు కుటుంబాలు రాజస్ధాన్ వెళుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫొటోలో నిహారిక, నాగబాబు, నాగబాబు సతీమణి, చైతన్య మరియు అతడి తల్లి తండ్రులు ఉన్నారు. 

ఈ వివాహ వేడుకకు మెగా ఫ్యామిలి మొత్తం హాజరై సందడి చేయనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా రెండు రోజుల ముందే పెళ్లికి హాజరు కనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వివాహానికి సంబంధించి వరుణ్ తేజ్ పెళ్లికి సంబందించిన పనులన్నీ దగ్గరుండి చేసుకోగా..బంధువులకు సంబందించిన విషయాలు నాగబాబు ఆయన సతీమణి చేసుకున్నారట. ఇదిలా ఉండగా మెగా డాటర్ అయినప్పటికీ నిహారిక షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. షార్ట్ ఫిలిమ్స్ లో తన టాలెంట్ ను నిరూపించుకున్న ఈ భామ సినిమాల్లోకి అడుగుపెట్టింది. సినిమాల్లో పెద్ద సక్సెస్ అవ్వలేకపోయినప్పటికి నిహారిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక పెళ్లి తరవాత ఈ అమ్మడి సినీ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.

More Related Stories