English   

సీతకు వెల్కమ్ చెప్పిన ఆర్ఆర్ఆర్ టీమ్

Alia Bhatt joins SS Rajamouli’s RRR shoot
2020-12-07 13:19:39

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా "ఆర్ఆర్ఆర్". ఈ సినిమాను ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్, రాంచరణ్ లు కథానాయకులు గా నటిస్తున్నారు. రాంచరణ్ మన్యం వీరుడు అల్లూరిగా..ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ తరవాత ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ ను పూణే, మహాభళేశ్వరం పరిసరాల్లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో చరణ్, ఎన్టీఆర్ లపై కీలక సన్నివేశాలను చిత్రించనున్నారట.

కాగా ఈ షెడ్యూల్ లో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ మేరకు అలియా ఆదివారం ముంబై ఎయిర్ పోర్ట్ నుండి భయలుదేరి షూటింగ్ స్పాట్ కు చేరుకుంది. ఇక తాజాగా అలియా భట్ షూటింగ్ స్పాట్ లో దర్శకుడు రాజమౌళి తో కలిసి మాట్లాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో అలియా రాంచరణ్ సరసన (సీతగా) హీరోయిన్ గా నటిస్తోంది. దాంతో ఆర్ఆర్ఆర్ టీం షూటింగ్ లో పాల్గొనడానికి  వచ్చిన సీతకు వెల్కమ్ అంటూ ఆహ్వానించింది.

More Related Stories