English   

మెగాస్టార్ పాటకు నిహారిక చైతన్య జంట చిందులు

 Niharika Konidela
2020-12-08 14:58:24

నిహారిక చైతన్యల పెళ్లికోసం ఇరువురి కుటుంబ సభ్యులు ఉదయ్ పూర్ చేరుకున్నారు. అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో ప్రత్యేక ఫ్లైట్ లో ఉదయ్ పూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అల్లు ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అయ్యాయి. మరోవైపు చిరంజీవి కుటుంబం కూడా ఉదయ్ పూర్ కు చేరుకుంది. ఎయిర్పోర్ట్ లో రాంచరణ్, ఉపాసన, చిరు అయన సతీమణి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

మరోవైపు నిహారిక బాబాయ్ పవన్ కళ్యాణ్ ఏపీ రైతులకు పంట నష్టం ఇవ్వావాలంటూ ఆయన నివాసంలో దీక్షకు దిగారు. దీక్ష అనంతరం పెళ్లి వేడుకకు హాజరు కానున్నట్టు తేలుతోంది. ఇక పెళ్లి వేడుకకు వెళ్లిన కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి జరిగిన సంగీత్ లో సందడి చేసారు. సంగీత్ లో నిహారిక చైతన్య తో కలిసి మెగాస్టార్ నటించిన "బావగారు బాగున్నారా " సినిమాలోని "ఆంటీ కూతురా ఆమ్మో అప్సరా " పాటకు చిందులు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రేపు (డిసెంబర్ 9)న నిహారిక-చైతన్య జంట రాత్రి 7:15నిమిషాలకు ఒకటి కాబోతున్నారు. మెగాడటర్  వీక్షించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More Related Stories