English   

ట్విట్టర్ లో మహేష్ కు సరిలేరవ్వరూ

Sarileru Neekevarru
2020-12-08 15:08:40

తెలుగు సినిమాలు ట్విట్టర్ లో సంచలనాలు క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ట్విట్టర్ ఇండియా డేటా ప్రకారం మహేష్ బాబు హీరోగా వస్తున్న "సరిలేరు నీకెవ్వరు" సినిమా అత్యధికంగా ట్వీట్ చేసిన హాష్ టాగ్ లలో మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన "దిల్ బెచారా" ఉండగా..రెండో స్థానంలో ఇటీవల సూర్య హీరోగా వచ్చిన "సురారై పోట్రూ" నిలిచింది. ఇదిలా ఉండగా సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతికి విడుదలైంది. తెలుగులో ఈ సినిమా మంచి విజయం సాధించింది. 

అంతే కాకుండా తమిళం లో డబ్ అయిన ఈ సినిమా అక్కడ కూడా అక్కడ కూడా భారీ కలెక్షన్ లు సాదించింది. టెలివిజన్ లో కూడా ఈ సినిమా ఎక్కువ టిఆర్పీ తో మరో రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సినిమాలో మహేష్ కు జంటగా రష్మిక నటించింది. ఇక ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు తరవాత మహేష్ సినిమాలు రాలేదు. దాంతో అభిమానుకు సర్కారు వారిపాట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక అభిమానుల అంచనాలకు సర్కారు వారి పాట ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి.

More Related Stories