English   

సీతారకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన అలియా..ఏంటంటే

 Alia Bhatt
2020-12-08 15:41:38

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార కు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. నమ్రత తరచూ సితార ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సితార బుల్లి సెలబ్రెటీ అయిపోయింది. సామాన్యులే కాక సెలబ్రెటీలు సైతం సితార అంటే ఎంతో లైక్ చేస్తారు. ఇక బాలీవుడ్ వుడ్ బ్యూటీ అలియా భట్ కు సైతం సితార అంటే ఎంతో ఇష్టం. 2018 లో మహేష్ బాబు మహర్షి సినిమా కోసం న్యూయార్క్ వెళ్ళినప్పుడు అలియా కూడా అక్కడ ఓ సినిమా షూట్ లో పాల్గొంటుంది. అదే సమయంలో మహేష్ కూతురు సితార ను అలియా చూసింది. 

ముద్దు ముద్దుగా ఉండే సీతారను అలియా దగ్గరకు తీసుకుంది. ఆ టైం లో అలియా తో సితార దిగిన ఫోటోను నమ్రత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన అలియా నమ్రత ను కలిసింది. కలిసిన సంధర్బంగా అలియా ఓ గిఫ్ట్ కూడా ఇచ్చింది. అదేంటనే అలియా తన సొంత బ్రాండ్ బట్టలను నమ్రతకు గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. ఇక అలియా ఇచ్చిన గిఫ్ట్ ను చూసి సితార మురిసిపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నాకెంతో ఇష్టమైన నటి అలియా భట్ ఈ డ్రెస్ తీసుకొచ్చింది. నాకు ఈ డ్రెస్ ఎంతో నచ్చిందని పేర్కొంది. చాలా హ్యాపీగా ఉంది అంటూ సితార అలియకు థాంక్స్ చెప్పింది.

More Related Stories