English   

సర్కారు వారి పాట..రూపాయి వెనక కథ ఇదేనా

Mahesh Babu
2020-12-08 16:42:45

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా "సర్కారు వారి పాట".  ఈ షూటింగ్ మొదలవ్వకముందే సినిమాలో కథ పై అందరికీ ఆసక్తి నెలకొంది. బ్యాంకుల్లో వందల కోట్ల అప్పులు చేసి విదేశాలకు వెళ్లిన విజయ్ మాల్యా లాంటి వాళ్ళ మెడలు వంచడమే ఈ కథలో సారాంశం అని తెలుస్తోంది. సినిమాలో మహేష్ బాబు మెడపై ఉన్న రూపాయి బిళ్ళ టాటూ పై కూడా ఆసక్తి నెలకొంది. ఆ బిళ్ళ వెనక కూడా పెద్ద కథ ఉందంటూ టాక్ నడుస్తోంది. సినిమాలో హీరో చిన్నతనంలోనే తల్లి తండ్రులను పోగొట్టుకుంటాడట. హీరోకు అన్నీ పోయి ఒక్క రూపాయి మాత్రమే మిగులుతుందట. 

ఆ రూపాయితో నిజాయితీగా కోట్లు సంపాదించాలనే ఆలోచనలో హీరో ఉంటాడట. హీరో ఎలా సంపాదిస్తారు. అన్నదే అసలు కథ. 5 పైసలతో 20 లక్షలు  సంపాదించిన ఛాలెంజ్..ఒక్క రూపాయితో ప్రయాణం మొదలు పెట్టిన "శివాజీ" సినిమాలు గుర్తొస్తాయి. కానీ ఆ కథలకు ఎలాంటి పోలిక లేకుండా పరశురాం "సర్కారు వారి పాట" కథ రాసుకున్నాడట. ఈ సినిమా షూటింగ్ ను జనవరిలో అమెరికాలో ప్లాన్ చేసారు. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల హైదరాబాద్ లోనే షూట్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తోందట. ఇక రూపాయి వెనక అసలు కథ ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

More Related Stories