నటుడు శరత్‌కుమార్‌కు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టి మళ్ళీ సెకండ్ వేవ్ రూపంలో దాడి చేస్తోంది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తి ఆగటం లేదు. పట్టణాల నుండి పల్లెల దాకా ఈ వైరస్ వ్యాపించింది. సాధారణ ప్రజలతో పాటు రాజాకీయ నాయకులు, సెలబ్రెటీలు సైతం కరోనా భారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే సెలబ్రెటీలు కరోనా బారినపడి కోలుకున్నారు. కాగా తాజాగా తమిళ సినీ నటుడు శరత్ కుమార్ కరోనా భారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్నీ శరత్ కుమార్ సతీమణి రాధికా శరత్ కుమార్ వెల్లడించారు. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటగా ఉందని తెలిపారు. నిపుణులైన డాక్టర్ల సమక్షంలో ఆయన చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా శరత్ కుమార్ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’లో కీలక పాత్రలో నటిస్తున్నారు.