English   

టీవీ నటి ఆత్మహత్య...అసలేం జరిగింది

Chitra
2020-12-09 11:08:32

ప్రముఖ తమిళ టీవీ నటి వీజే చిత్ర ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని ఓ హోటల్‌లో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. చెన్నైలోని ఓ స్టార్ హోటల్‌లో ఉరి వేసుకున్న స్థితిలో ఆమెను పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు రోజు రాత్రి ఆమె ఈవీపీ ఫిల్మ్‌సిటీలోని ఓ టీవీ సీరియల్ షూటింగ్‌లో చిత్ర పాల్గొన్నారు. తెల్లవారు జామున 2:30 గంటలకు ఆమె హోటల్ గదికి చేరుకున్నారు. చిత్ర ఆత్మహత్య చేసుకున్న సమయంలో హేమంత్ హోటల్ లోనే ఉన్నారు... అతడిని బయటకు పంపించి చిత్ర ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు.  హఠాత్తుగా ఆమె ఆత్మహత్య చేసుకోవడం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. సమచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 28 సంవత్సరాల వయస్సున్న చిత్ర ఆత్మహత్య చేసుకోవడంపై తమిళ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. పాపులర్ టీవీ షో పాండ్యన్ స్టోర్స్‌లో ఆమె నటించారు. పలు సినిమాల్లోనూ ఆమె నటించి మెప్పించారు. ఇదిలా ఉండగా ఇటీవలే చిత్రకు ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగింది.

More Related Stories