English   

నిహారిక పెళ్లి కానుకగా మెగాస్టార్ వజ్రాలహారం

Chiranjeevi
2020-12-09 12:02:22

మెగా డాటర్ నిహారిక చైతన్య జొన్నగడ్డల వివాహ వేడుక రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరుగుతోంది. ఇప్పటికే పెళ్లికి ముందు జరగాల్సిన సంగీత్..మెహందీ కార్యక్రమాలు ఒక రేంజ్ లో జరిగాయి. సంగీత్ లో చైతన్య నిహారిక వేసిన స్టెప్పుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ కూడా నిహారిక తో కలిసి డ్యాన్స్ చేసిన ఫోటోలు భయటకు వచ్చాయి. ఇక పెళ్లిలో ఇటు మెగాఫ్యామిలీ..అటు అల్లు వారి ఫ్యామిలీ సందడి చేస్తున్నారు. నిన్న జరిగిన ఓ వేడుకలో నిహారికకు మమయ్యాలు..పెదనాన్న కానుకలు పెట్టారు. అయితే వచ్చిన కానుకల్లో మెగాస్టార్ పెట్టిన కనుకే హైలెట్ గా నిలిచిందట. మెగాస్టార్ చిరంజీవి నిహారికకు ఓ వజ్రాల హారాన్ని పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. దాని ధర ఏకంగా 2కోట్ల వరకు ఉంటుందట. మెహంది వేడుక సంధర్భంగా మెగాస్టార్-సురేఖ దంపతులు ఈ కానుకను సమర్పించారు. అలాగే చైతన్యకు కూడా మెగాస్టార్ ఖరీదైన కనుక ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక డిసెంబర్ 9న సాయంత్రం 7:15 నిమిషాలకు ముహూర్తం కావడం తో మెగాస్టార్..నాగబాబు పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నిన్న వివాహానికి హాజరయ్యేందుకు ఉదయ్ పూర్ చేరుకున్నాడు.
 

More Related Stories