English   

యాపిల్ ప్రోడక్ట్స్ పై నాగార్జున సీరియస్..జాగ్రత్తగా ఉండండి

Nagarjuna
2020-12-09 17:14:11

ప్రముఖ ఫోన్ల కంపెనీ యాపిల్ పై హీరో నాగార్జున సీరియస్ అయ్యారు. యాపిల్ ప్రోడక్ట్స్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ కూడా పెట్టారు. "యాపిల్ ఇండియా స్టోర్ నుండి ప్రోడక్ట్ లు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వారి విధానాలు, సేవలు భయకరంగా ఉంటాయి" అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే నాగార్జున ఇలా యాపిల్ ప్రోడక్ట్ లపై ఎందుకు సీరియస్ అవుతున్నాడో మాత్రం క్లారిటీగా చెప్పలేదు. ఎంతో ప్రఖ్యాతి చెందిన యాపిల్ ఫోన్స్ అంటే ఇష్టపడని వారు ఉండరు. ముఖ్యంగా సెలెబ్రెటీల చేతులో యాపిల్ తప్ప మరో ఫోన్ కనిపించదు. అలాంటి యాపిల్ పై నాగ్ ఇలా ఘాటుగా స్పందించడం గమనార్హం. నాగార్జున ఏదైనా ప్రోడక్ట్ సర్వీస్ విషయంలో నిరాశ చెంది ఉంటాడేమో అందుకే ఇలా సీరియస్ అయ్యాడని నెటిజన్లు నాగ్ ట్వీట్ కు కామెంట్స్ పెడుతున్నారు. ఇక నాగ్ ట్వీట్ పై యాపిల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇదిలా ఉండగా నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే మనాలి లో ఆయన తన షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. అంతే కాకుండా బిగ్ బాస్ హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ నాగ్ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగ్ ఈ సీజన్ కు మాత్రం నెగిటివిటీని మూటగట్టుకున్నారు. హౌస్ లో అన్ ఫెయిర్ ఎలిమినేషన్ల కారణంగా ప్రేక్షుకులు నాగ్ పై ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు అభిజిత్ ను కావాలనే నాగ్ డీ గ్రేడ్ చేసి మాట్లాడుతున్నదంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ పెరిగాయి. దాంతో నాగ్ ఫ్యాన్స్ అభిజిత్ అభిమానులకు కేసులు పెడతామంటూ వార్ణింగ్ ఇచ్చారు.

More Related Stories