English   

సత్యదేవ్ తిమ్మరుసు టీజర్ టాక్

Thimmarusu
2020-12-09 18:29:09

విభిన్న కథలతో వస్తున్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్. సాధారణ నటుడిగా కెరీర్ ప్రారంభించిన సత్యదేవ్ "జ్యోతిలక్ష్మి" సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో సత్యదేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక లాక్ డౌన్ కాలంలో సత్యదేవ్ నటించిన లాక్డ్ వెబ్ సిరీస్ తోను సత్యదేవ్ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తరవాత ఓటీటీ లో విడుదలైన ఉమామహేశ్వర ఉగ్రరూపాస్య సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమాతో సత్యదేవ్ కు విమర్శకుల ప్రశంసలు అందాయి. ఆ సినిమాతో సత్యదేవ్ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నాడు. 

ఇక తాజాగా సత్యదేవ్ నటించిన "తిమ్మరుసు" సినిమా టీజర్ విడుదలైంది. షరన్ కొప్పి శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ అధినేత మహేష్ కోనేరు..సృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక టీజర్ విశయనికొస్తే...సత్యదేవ్ ఈ సినిమాలో నిజాయితీగల లాయర్ పాత్రలో నటిస్తున్నట్టు అర్థమైంది. భుజంపై కోటు వేసుకుని నాకు న్యాయం గెలవడమే ఇంపార్టెంట్ అంటూ సత్యదేవ్ డైలాగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక చివర్లో గన్ పట్టుకుని కనిపించి సస్పెన్స్ లో పెట్టాడు. దాంతో స్టోరీలైన్ కూడా భయటకు రాలేదు. టీజర్ లో మ్యూజిక్..సత్యదేవ్ లుక్స్ అదిరిపోయాయనే చెప్పొచ్చు.

More Related Stories