English   

నిహారిక చైత్యన్య వెడ్డింగ్..నాగబాబు ఎమోషనల్

Naga Babu
2020-12-10 11:11:24

మెగా డాటర్ నిహారిక వివాహం అంగ రంగ వైభవంగా జరిగింది. బంధు మిత్రుల సందడి, వేదమంత్రాలు చదువుతున్న సమయాన  చైత్యన్య  మెగా డాటర్ మెడలో తాలి కట్టారు. ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ లో వీరి వివాహం జరిగింది. వివాహానికి మెగా ఫ్యామిలీ తో పాటు పలువురు ముఖ్య సెలబ్రెటీలు హాజరయ్యారు. కొత్త జంటను అందరూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నిహారిక పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిహారిక పెళ్లిలో మెగాస్టార్, పవర్ స్టార్ లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇదిలా ఉండగా పెళ్లి తరవాత నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు. నా కుమార్తె మొదటి రోజు స్కూల్ కు వెళ్లినట్టు అనిపిస్తుంది. కానీ ఆమె సాయంత్రం తిరిగి ఇంటికి రాదు. నా బిడ్డ బడికి వెళ్ళినప్పుడు ఆమెతో 24గంటలు ఆడుకోలేనని నా మనసుకు చెప్పడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందని..ఈసారి ఎంతకాలం పడుతుందో చూడాలని..దాన్ని కాలమే నిర్ణయిస్తోంది. నిన్ను చాలా మిస్ అవుతున్నా నిహారిక తల్లి అంటూ..నిహారిక పెళ్లి ఫోటోను  నాగబాబు తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.

More Related Stories