English   

సిగ్గు ఉండాలంటూ మళ్ళీ కంట్రోల్ తప్పిన బిగ్ బాస్ సోహెల్

Bigg Boss Telugu
2020-12-10 12:52:45

బిగ్ బాస్ తెలుగు ముగింపు దశకు చేరుకుంది. దాంతో హౌస్ మేట్స్ మధ్య పోటీ కూడా బాగానే పెరిగింది. ఇక తాజగా మళ్ళీ సోహెల్ హౌస్ లో కంట్రోల్ తప్పాడు. ఇప్పటికే నాగరాజున కంట్రోల్ లో ఉండాలని సోహెల్ కు హెచ్చరించాడు. అమ్మాయిలపై నోరు పెంచొద్దని కొరడా జులిపించాడు. అయినప్పటికీ సోషల్ మరోసారి కేకలు పెడుతూ అరియనా పైకి వెళ్ళాడు. అయితే సోహెల్ కంట్రోల్ తప్పడానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం..ఓపిక టాస్క్ లో భాగంగా సోహెల్ మొన్న అరియనా బొమ్మ చింటూ ని నీళ్లలో పడేసాడు. టాస్క్ లో ఉన్న అరియనా అప్పుడు స్పందించలేదు. ఇక సోహెల్ రోబో లా ఉండే టైమ్ రావడంతో అరియానకు ఛాన్స్ వచ్చింది. దాంతో అరియనా..సోహెల్ కు ప్రశ్నల వర్షం కురిపించింది. బొమ్మను నీళ్ళల్లో పడేసి ఎమోషన్స్ తో ఆడుకున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

టాస్క్ లో క్రూరత్వం ప్రదర్శించావంటూ సోహెల్ పై విరుచుకుపడింది. అంతే కాకుండా ఎన్నో మాటలు అంది. ఇక రోబో టాస్క్ లో ఉన్న సోహెల్ అన్నీ భరిస్తూ కూచున్నాడు. భజర్ మొగగానే సోహెల్ అరియనా తో గొడవకు దిగాడు. నువ్వు టాస్క్ లో మోనాల్ పై గుడ్డు కొట్టలేదా..అది అరాచకం కాదా అంటూ ప్రశ్నించాడు. తొక్కలో బొమ్మ  కోసం నీ ఫ్రెండ్ అవినాష్ నే ఎడిపించావ్ సిగ్గు ఉండాలంటూ ఫైర్ అయ్యాడు. దాంతో అరియనా నాతో పెట్టుకోవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చింది. గొడవ ఎక్కువ అవ్వడంతో అఖిల్ , అభిజిత్ లు ఇద్దరిని ఆపే ప్రయత్నం చేశారు. ఇక గొడవ అయి ఇద్దరూ పక్కకి వెళ్ళాక కూడా అరియనా మళ్ళీ ఏడుస్తూ మొదలు పెట్టింది. తనపైకి ఓ అబ్బాయి రావడం మొదటి సారి అంటూ సోహెల్ పై ఆరోపణలు చేసింది. దాంతో అఖిల్ మీరు ఇద్దరూ సమానంగా గొడవ పెట్టుకున్నారు. ఇప్పుడు నువ్ సోహెల్ ను బ్యాడ్ చేయద్దు అంటూ చెప్పాడు. కాగా నాకు అనిపించింది నేను చెబుతున్నా అంటూ అరియనా సమాధానం ఇచ్చింది. ఇక మళ్ళీ ఈ టామ్ అండ్ జెర్రీ కలుస్తారో లేదో చూడాలి.

More Related Stories