English   

రానా విరటపర్వం లో మరో హీరోయిన్

Nivetha Thomas
2020-12-10 15:51:16

బాహుబలి  సినిమా తరవాత రానా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రానా విరటపర్వం అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ రానా అనారోగ్య సమస్య కారణంగా తొలుత ఆగిపోయింది. తరవాత కరోనా కారణంగా మళ్ళీ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక తిరిగి 8నెలల తరవాత షూటింగ్ ను మళ్ళీ ప్రారంభించారు. సినిమాలో రానా ప్రధాన పాత్రలో నటిస్తుండగా..నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్లలో రానా..సాయి పల్లవి లుక్ ఎంతగానో ఆకట్టుకుంది.

 సినిమా విప్లవం నేపథ్యంలో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. కాగా సినిమాకు సంబంధించి మేజర్ పార్ట్ ను పూర్తిచేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హీరోయిన్ నివేదిత థామస్ కూడా నటిస్తోంది. తాజాగా నివేదిత షూటింగ్ లో పాల్గొంటున్నట్లు సమాచారం. కాగా నివేదిత కూడా సినిమాలో భాగం అవ్వడంతో రానా విరటపర్వం లో ఇద్దరితో రొమాన్క్ చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికే రానా విరటపర్వం పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను రానా రీచ్ అవుతాడా లేదా చూడాలి.

More Related Stories