English   

నాని శ్యామ్ సింగరాయ్ క్లాప్ పడింది

Nanis Shyam Singha Roy
2020-12-10 16:00:19

నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో నాని సరసన ఉప్పెన బ్యూటీ క్రితి శెట్టి, సాయి పల్లవి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈరోజు శ్యామ్ సింగరాయ్ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తి చేసి షూటింగ్ ను మొదలు పెట్టారు. ఈ సినిమాకు నాని తండ్రి క్లాప్ కొట్టారు. నాని తండ్రి సినిమా కార్యక్రమానికి వచ్చి క్లాప్ కొట్టడం ఇదే మొదటి సారి. ఇక నాని శ్యామ్ సింగరాయ్ పై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. మరి నాని ఆ అంచనాలను రీచ్ అవుతారా..లేదా అన్నది చూడాలి. 

ఇదిలా ఉండగా నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టి హీరోగా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు. సహజంగా నటించే నాని. తక్కువకాలంలో నాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. "అష్టాచెమ్మ" సినిమాతో నాని మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరవాత అలా మొదలైంది సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస సినిమాతో బిజీ అయ్యాడు. ఇక లాక్ డౌన్ కాలంలో నాని..సుదీర్ బాబు నటించిన "వి" సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. దాంతో నాని శ్యామ్ సింగరాయ్ తో హిట్ కొట్టాలనే ఉత్సాహంతో ఉన్నాడు.

More Related Stories