English   

ఒక్క ట్వీట్ తో హీరోల ఫ్యాన్స్ కు విరోధిగా మారిన సమంత

Samantha
2020-12-10 16:42:05

ఒకే ఒక్క పోస్ట్ తో సమంత అటు మహేష్ బాబు అభిమానులు..ఇటు అల్లు అర్జున్ అభిమానులు హేట్ చేసేలా అయింది. నిజానికి సమంత ఈ ఇరువురు హీరోల జోలికి...వారి అభిమానుల జోలికి వెళ్ళలేదు. కానీ ఓ సినిమాను పొగుడుతూ సమంత  ట్వీట్ చేసింది. అదే సమంత చేసిన బ్లండర్ మిస్టేక్ అయ్యింది. అసలు విషయానికొస్తే..సమంత ఇటీవల సూర్య ప్రధాన పాత్రలో నటించిన "ఆకాశమే నీ హద్దురా" సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది.

అంతే కాకుండా ఈ సినిమా "మూవీ ఆఫ్ ది ఇయర్" అంటూ కాస్త ఎక్కువగానే పొగిడేసింది. అయితే సమంత చేసిన కామెంట్స్ మన తెలుగు హీరోలు మహేష్ బాబు, బన్నీ తమ్ముళ్లకి నచ్చలేదు. దాంతో ట్రోల్స్ ప్రారంభించారు. మన సినిమాలు మీరు చూళ్ళేదా..మొన్న సంక్రాంతికి వచ్చిన సరి లేరు నీకెవ్వరు, అల వైకుంటపురం సినిమాలు మీకు నచ్చలేదా..అంతగా ఆ డబ్బింగ్ సినిమాను పొగుడుతున్నారంటూ ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై సమంత మాత్రం ఎలాంటి కామెంట్ చేయలేదు. నిజానికి ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కోలా ఉంటాయి. అలా ఉండటంలో తప్పులేదు. అందరి అభిప్రాయాలు తమలానే ఉండాలనుకోవడమే తప్పు.

More Related Stories