English   

వర్మ బిగ్ బాస్ కు వెళ్తాడంట.. కానీ కండిషన్స్ అప్లై..

RGV
2020-12-11 12:46:21

నమ్మడానికి కాస్త విచిత్రంగా ఉన్నా కూడా వర్మ ఇప్పుడు ఇదే చెప్పాడు. తాను బిగ్ బాస్ కి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. మొన్నటి వరకు అసలు బిగ్ బాస్ అంటే ఏంటో తెలియదు.. దాని కాన్సెప్ట్ నాకు ఐడియా లేదు.. అసలు ఇప్పటివరకు ఒక్కసారి కూడా బిగ్ బాస్ నేను చూడలేదు అంటూ కామెంట్ చేశాడు వర్మ. అప్పుడప్పుడో ఒక సారి చూసినా అది కూడా కేవలం సన్నిలియోన్ కోసం మాత్రమే చూశాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. అలాంటిది ఇప్పుడు బిగ్ బాస్ వెళ్లాలనే కోరిక కలిగింది. అయితే అది ఆయన మనసులో నుంచి వచ్చిన మాట కాదు. తాజాగా ఆయన కరోనా వైరస్ అనే సినిమా తెరకెక్కించాడు. డిసెంబర్ 11న ఈ సినిమా రిలీజ్ ఉండటంతో అన్ని యూట్యూబ్, ఎలక్ట్రానిక్ చానల్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆర్జీవి.

అందులో భాగంగా వాళ్లు కూడా వర్మను బాగానే ఆడుకున్నారు.. కొందర్ని ఆర్జీవి తిరిగి ఆడుకున్నాడు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ టాపిక్ కూడా వచ్చింది. ఈ సారి బిగ్ బాస్ సీజన్ లో మీరు ప్రమోట్ చేసిన అరియానా అనే యాంకర్ ఉంది తెలుసా అంటూ వర్మను అడిగారు. దానికి ఆయన తెలియదు అంటూ సమాధానం చెప్పాడు. మీ ఇంటర్వ్యూతో ఫేమస్ అయిన ఈ అమ్మాయి ఇప్పుడు టాప్ సిక్స్ లో ఒకరిగా ఉంది.. ఈ కంటెస్టెంట్ ఫైనల్ కూడా వెళ్లే అవకాశం ఉంది అంటూ వర్మకు చెప్పారు. దాంతో ఆయన చాలా సంతోషించాడు. తన సపోర్ట్ అరియానాకే ఉంటుంది అంటూ కన్ఫర్మ్ చేశాడు. అయితే తనలాంటి వాడికి బిగ్బాస్ అసలు సెట్ అవ్వదని.. ఒకవేళ తాను వెళ్లాల్సి వస్తే 16 మందిలో తాను ఒక్కడినే ఉండి మిగిలిన 15 మందిని లేడీ కంటెస్టెంట్స్ పెట్టాలని కండిషన్ పెట్టాడు. అప్పుడైతే తన వెళ్లడానికి రెడీ అంటున్నాడు వర్మ. ఏదేమైనా చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. వర్మ నుంచి ఇలాంటి కండిషన్స్ కాకుండా వేరేవి ఎలా ఊహిస్తారు చెప్పండి. 

More Related Stories