English   

సోలో బ్రతుకే సో బెటర్ టైటిల్ సాంగ్ విడుదల..

Solo Brathuke So Better
2020-12-11 13:00:53

సాయి ధరమ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. చిత్రలహరి, ప్రతిరోజూ పండగే లాంటి హిట్ సినిమాల తర్వాత సాయి చేస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. సోలో బ్రతుకే సో బెటరూ.. బోలో బోలో బ్యాచిలర్ అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన లిరిక్స్ అదిరిపోయాయి. దానికి తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక కాలేజీలో ఈ పాటను చిత్రీకరించారు. వందల మంది డాన్సర్ లతో షూట్ చేసిన ఈ పాట సినిమాలో హైలెట్ అవుతుందని అంటున్నారు దర్శక నిర్మాతలు.

మరీ ముఖ్యంగా ఇందులో లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. పెళ్లి వద్దు.. బ్యాచిలర్ లైఫ్ అద్భుతం అంటూ సిరివెన్నెల కలం నుంచి జాలువారిన పదాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సన్యాసంలోనే ఇహముంది పరముంది.. సంసారంలో ఏముంది.. పెద్దవాళ్లకు తెలియని సత్యమా ఇది అంటూ పెళ్లిపై సెటైరికల్ సాహిత్యం రాశాడు సిరివెన్నెల సీతారామశాస్త్రి. దానికి తోడు బ్యాక్ గ్రౌండ్ లో ఆర్ నారాయణమూర్తి, మాజీ ప్రధాని వాజ్ పేయి, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, మదర్ థెరిస్సా లాంటి వాళ్ళ ఫోటోలు పెట్టారు. ఇది పాటకు మరింత ప్రధాన ఆకర్షణగా నిలిచింది. డిసెంబర్ 25న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా వచ్చినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా లేదా అనేది సస్పెన్స్. ఏదేమైనా ఈ సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేయాలని చూస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. 

More Related Stories