English   

రామ్ చరణ్ ఆచార్యకి రాజమౌళి అనుమతి.. 

 Ram Charan
2020-12-12 08:24:14

రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి RRR సినిమాలో నటిస్తూనే మరోవైపు తండ్రి చిరంజీవి ఆచార్య సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. అంతేకాదు అందులో చిన్న పాత్రలో కూడా మెరుస్తున్నాడు మెగా పవర్ స్టార్. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై నిర్మిస్తున్నాడు చరణ్. నిహారిక పెళ్లి కోసం షూటింగ్ కి బ్రేక్ తీసుకున్న చరణ్.. త్వరలోనే తిరిగి సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. అయితే జనవరి వరకు 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ చేసి.. ఆ తర్వాత 'ఆచార్య' షూటింగ్ లో పాల్గొనడానికి చెర్రీ ప్లాన్స్ చూసుకుంటున్నాడట. దీని కోసం ఇప్పటికే రాజమౌళి అనుమతి కూడా తీసుకున్నాడట.'ఆచార్య' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో జరుపుతున్నారు. త్వరలోనే హీరోయిన్ కాజల్ కిచ్లు కూడా షూటింగ్ లో జాయిన్ కానుందని సమాచారం.

More Related Stories