English   

జెమిని టీవీలో ఎన్టీఆర్ రియాల్టీ షో

NTR
2020-12-12 08:38:35

బిగ్ బాస్ తరువాత మరోసారి ఎన్టీఆర్ ను బుల్లితెరమీద చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ మళ్లీ మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్నాడట. అయితే అది బిగ్ బాస్ కోసం కాదు. ప్రముఖ ఛానల్ నిర్వహిస్తున్న ఓ టాక్ షోకు తారక్ హోస్ట్ గా మారనున్నాడని అంటున్నారు. ఈ షో కోసం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ను వేయిస్తున్నారట. ఈ షో కోసం వారానికి ఒకటి రెండు రోజులు కేటాయిస్తే సరిపోతుందని తెలుస్తోంది. ఈ షో కి ఎన్టీఆర్ డ్రెస్సింగ్ స్టయిల్, గెటప్ అన్నీ డిఫరెంట్ గా వుండేలా ప్లానింగ్ ప్రారంభమైంది.మరో వైపు ఆర్ఆర్ఆర్ పూర్తైన వెంటనే త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా మార్చిలో పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇంత బిజీ షెడ్యూల్ లోను తారక్ టీవీ షో చేయడానికి సిద్ధం అవుతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మ‌రి దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

More Related Stories