డ్రగ్స్ కేసులో సంజనకు బెయిల్

2020-12-12 08:56:16
డ్రగ్స్ కేసులో అరెస్టయిన కన్నడ నటి సంజనకు ఎట్టకేలకు ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తొలుత బాలీవుడ్లో మొదలైన డ్రగ్ రాకెట్ కేసు ఆపై కన్నడ సినీ ఇండస్ట్రీకి తాకింది. ఈ క్రమంలో నటి సంజనకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సెప్టెంబర్ నెలలో సంజన, రాగిణిని విచారించిన బెంగళూరు సీసీబీ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. నటి సంజనకు మంజూరు చేసిన బెయిల్ కోసం ఇద్దరు వ్యక్తులు పూచీకత్తుతో రూ.3 లక్షల వ్యక్తిగత బాండ్ ఇవ్వాలి. విచారణలో భాగంగా ప్రతి నెల రెండుసార్లు నటి సంజన విచారణకు హాజరు కావాలి. డ్రగ్స్ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించకూడదు. సాక్ష్యాలు మార్చేందుకు ఎలాంటి చర్యలకు పాల్పడకూడదు.