English   

నిహారిక పెళ్లికి ఎన్ని కోట్ల విలువైన బహుమతులు వచ్చాయో తెలుసా..

Niharika Konidela
2020-12-12 17:04:18

మెగా డాటర్ నిహారిక కొణిదెల వివాహం డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయపూర్ కోటలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా రెండు రోజులు పూర్తిగా కూతురు పెళ్లి కోసం కేటాయించాడు. ఇదిలా ఉంటే నిహారిక పెళ్లికి కోట్లు విలువ చేసే బహుమతులు వచ్చాయని తెలుస్తోంది. ఈయనకు కుటుంబ సభ్యులే భారీ బహుమతులు ఇచ్చారు. తను డాడీ డాడీ అని ఆప్యాయంగా పిలిచే నిహారిక కోసం చిరంజీవి దాదాపు కోటిన్నర రూపాయలు ఖర్చు చేసి ఒక ఆభరణం చేయించాడని ప్రచారం జరుగుతుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా దాదాపు రెండు కోట్లు విలువ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా కోటి రూపాయలకు పైగానే గిఫ్ట్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. అన్న వరుణ్ తేజ్ సైతం చెల్లెలికి ప్రేమతో భారీ బహుమతులు ఇచ్చాడు. వీళ్లతో పాటు పెళ్లికి వచ్చిన అతిథులు కూడా నిహారిక కోసం ఖరీదైన బహుమతులు తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ లెక్కకడితే దాదాపు 10 కోట్ల రూపాయలు దాటిపోయాయి అని.. అంతే కాకుండా మళ్లీ చిన్నాచితకా గిఫ్టులు కూడా బాగానే వచ్చాయని తెలుస్తోంది. ఎటు చూసుకున్న కూడా నిహారిక పెళ్ళికి దాదాపు 11 కోట్ల విలువైన గిఫ్టులు వచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం పెళ్లికి మాత్రమే త్వరలోనే సినీ రాజకీయ ప్రముఖులు అందరినీ పిలిచి భారీగా పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. అందులో కూడా చాలావరకు ఖరీదైన బహుమతులు వస్తాయని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే మెగా కుటుంబానికి బయట ఆ మాత్రం డిమాండ్ వుంది కాబట్టి. ఏదేమైనా కూడా మెగా డాటర్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. 

More Related Stories