English   

సాయి ధరమ్ తేజ్ నమ్మకం నిజం అవుతుందా లేదా..

 Sai Tej Solo Brathuke So Better release date
2020-12-12 17:17:10

మెల్ల మెల్లగా రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లోనే ఓపెన్ అవుతున్నాయి. బయట పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని స్క్రీన్స్ ఓపెన్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అక్కడక్కడ మినహా  మ్యాగ్జిమం అన్నిచోట్ల థియేటర్లు తెరుచుకున్నాయి. అయితే ఇప్పటివరకు పేరున్న పెద్ద సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. దాంతో హాలీవుడ్ లో విడుదలైన టెనెట్ సినిమానే మన థియేటర్లలో విడుదల చేశారు. దానికి రెస్పాన్స్ ఊహించనంత రాలేదు. కేవలం హైదరాబాద్లో మాత్రమే కొన్ని థియేటర్లలో ప్రేక్షకులు కనిపించారు. మిగిలిన చోట్ల రెస్పాన్స్ లేదు. ఒక్కో థియేటర్ లో కనీసం 10 మంది కూడా కనిపించడం లేదు. దాంతో నిర్మాతలకు భయం భయంగానే ఉంది. సినిమాలు విడుదల చేస్తే పరిస్థితి ఏంటి అనే టెన్షన్ వాళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సందర్భంలో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

విడుదల తేది కన్ఫర్మ్ చేసిన కూడా చివరి నిమిషంలో మార్చేస్తారు అని చాలామంది అనుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అలాంటి ఆలోచనలు లేనట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ విడుదల చేశారు. ఇప్పుడు కూడా తమ సినిమాని డిసెంబర్ 25న అనుకున్న తేదీకి వస్తుందని మరోసారి కన్ఫామ్ చేశారు దర్శక నిర్మాతలు. ఆ సినిమాను నేరుగా థియేటర్లలో విడుదల చేయడం ఆనందంగా ఉందని ఎప్పటిలాగే ఈలలు గోలలు చప్పట్ల కోసం వేచి చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు సాయి తేజ్. ఆయన ధైర్యం చూస్తుంటే మిగిలిన వాళ్ళు సాహో అనకుండా ఉండలేకపోతున్నారు. ఇదిలా ఉంటే సోలో బ్రతుకే సో బెటరూ సినిమా విడుదల కోసం సాయి ధరమ్ కంటే కూడా ఇండస్ట్రీ ఆసక్తిగా వేచి చూస్తుంది. ఇది తీసుకు వచ్చే ఫలితంపైనే మిగిలిన సినిమాల పరిస్థితి ఆధారపడి ఉంది. ఏదేమైనా ఈయన పెట్టుకున్న నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. 
 

More Related Stories