English   

విరాటప‌ర్వం ఫ‌స్ట్ లుక్..నక్సలైట్ నాయకుడుగా రానా

Virataparvam First look
2020-12-14 09:53:28

ఈరోజు రానా పుట్టిన రోజు సంద‌ర్భంగా `విరాట‌ప‌ర్వం` మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. నక్సలైట్ నాయకుడు రవి అన్నా పాత్రలో రానా నటిస్తున్నారు.  చేతిలో తుపాకీ, క‌ళ్ల‌లో తీక్ష‌ణ‌త తో న‌క్స‌లైట్ పాత్ర‌లో ఒదిగిపోయాడు రానా. ఈ పాత్ర కోసం.. రానా బ‌రువు కూడా త‌గ్గాడు. మ‌రి కొద్ది నిమిషాల‌లో మూవీకి సంబంధించి టీజ‌ర్ కూడా రానుంది.  విరాటపర్వం’ చిత్రాన్ని ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకుడు.  ఈ సినిమాలో నివేదా పెతురాజ్ కూడా‌ కీలక పాత్ర పోషిస్తోంది.  ‘సామాజిక ఇతివృత్తానికి వాణిజ్య హంగుల్ని మేళవిస్తూ రూపొందిస్తున్నారు . ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావ్‌, సాయిచంద్‌, బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. 

More Related Stories