English   

డర్టీ హరీ సినీ నిర్మాత పై కేసు నమోదు

Dirty Hari
2020-12-14 12:44:29

డర్టీ హరీ సినీ నిర్మాత పై కేసు నమోదయింది. వెంకటగిరి ప్రాంతంలోని మెట్రో ఫిల్లర్ పై అతికించిన సినీ పోస్టర్ల పై పోలీసులు కేసు నమోదు చేసారు. స్త్రీ గౌరవాన్ని అవమానించేలా...యువతను తప్పుదోవ పట్టించేరీతిలో డర్టీ హరీ సినిమా పోస్టర్లు ఉన్నాయని సినీ నిర్మాత శివరామకృష్ణ తో పాటు పబ్లిషింగ్ ఏజెన్సీల పై జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేసారు. ఇదిలా ఉండగా డర్టీ హరి సినిమా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కుతోంది. సినిమాలో రుహాణి, శ్రావణ్ రెడ్డి లు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.  ఈ సినిమాకు ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే స్టార్ హీరోలతో సినిమాలు..భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించిన ఎంఎస్ రాజు ఓ బోల్డ్ కంటెంట్ సినిమాతో వస్తుండటంపై ఇప్పటికే విమర్శలు వచ్చాయి. అయితే ప్రస్తుతం తెలుగు సినిమాల్లో...వెబ్ సిరీస్ లలో బూతు పురాణం పెరిగింది వాస్తవమే కానీ ఓ పేరున్న వ్యక్తి ఇలాంటి సినిమా తీస్తుండటం ప్రేక్షకులను కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక ఈ సినిమాను ఎస్పిజే క్రియేషన్స్ బ్యానర్ పై గూడూరు శివ రామకృష్ణ సమర్పణలో సతీష్ బాబు, సాయి పునీత్ సినిమాను నిర్మిస్తున్నారు. 

More Related Stories