English   

తిరుమలలో మెరిసిన కొత్త జంట

Niharika
2020-12-14 14:28:28

మెగా డాటర్ నిహారిక గుంటూరు ఐజీ కుమారుడు చైతన్య ను వివాహం చేసుజున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్ పూర్ లో నిహారిక-చైతన్య ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి ప్రముఖ సెలబ్రెటీలతో పాటు నిహారిక, చైతన్య ల బంధు మిత్రులు హాజరయ్యారు. సంగీత్ లో నిహారిక చైతన్య లు పాటలకు స్టెప్పులేసి అలరించారు. ఇక డిసెంబర్ 11న హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో రిసెప్షన్ జరిగింది. ఈ రిసెప్షన్ కి సెలబ్రెటీలు, ఇండస్ట్రీకి చెందిన పెద్దలు హాజరయ్యారు.

 నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా నిహారిక నిశ్చితార్థం సమయం నుండే ఇరువురి ఫోటోలు సోషల్ మీడియాలో వైరవ్ అవుతున్నాయి. నిహారిక-చైతన్య జంట చూడ ముచ్చటగా ఉందంటూ నెటిజన్లు మెగా అభిమానులు అభినందిస్తున్నారు. ఇక తాజాగా నిశ్చయ్ జంట తిరుమలలో మెరిసింది. వీఐపీ దర్శనం సమయంలో నిహారిక, చైతన్యలు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకస్వామి మండపంలో తీర్థప్రసాదాలు స్వీకరించారు.

More Related Stories