English   

ఆహాలో అమలా పాల్ ఇంట్రెస్టింగ్ షో

Amala Paul
2020-12-14 16:01:22

తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆహా రోజు రోజుకు ప్రేక్షకులకు దగ్గరవుతోంది. వెబ్ సిరీస్ లు, సినిమాలు, షోలతో ఆకట్టుకుంటోంది. ప్రముఖ నటీనటులు ఆహా లో షోలు చేస్తున్నారు. ఇప్పటికే "సామ్ జామ్" అనే టాక్ షోతో సమంత సందడి చేస్తుంది. ఈ టాక్ షోకు మెగాస్టార్ ,రానా ,విజయ్ దేవరకొండ లాంటి స్టార్ లు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇక తాజాగా ఆహాలో మరో ఆసక్తికరమైన ఫాంటసీ షో మొదలవుతున్నట్టు తెలుస్తోంది. ఈ షోను యుటర్న్, లూసియా సినిమాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు పవన్ తెరకెక్కిస్తున్నారు. ఈ షోలో హీరోయిన్ అమలా పాల్ ముఖ్యపాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ థ్రిల్లర్ ఫాంటసీ షోకు సంబందించిన పేరును, వివరాలను త్వరలోనే ఆహా ప్రకటించనుంది.  ఇదిలా ఉండగా డైరెక్టర్ పవన్ నెట్ ఫ్లిక్స్ లో "లైలా" నే పేరుతో ఓ భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. దీప మెహతా, శంకర్ రామన్ ఈ వెబ్ సిరీస్ లో ముఖ్యపాత్రల్లో నటించారు.

More Related Stories