English   

రజినీకాంత్ పార్టీ పేరు గుర్తు ఖరారు

Rajinikanth
2020-12-15 11:03:19

తమిళనాడులో రాబోయే ఎన్నికలకు సూపర్ స్టార్ రజిని కాంత్ సిద్ధమౌతున్నారు. కొద్ది రోజుల క్రితం అభిమాన సంఘాలతో చెన్నైలో సమావేశమైన రజినీ త్వరలో పార్టీ పేరును..పార్టీ గుర్తును ప్రకటిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆయన తన పార్టీ పేరును "మక్కల్ సేవై కర్చి" అనే పేరుతో రిజిస్టర్ చేయించారు. అయితే రజినీ కాంత్ పార్టీ గుర్తుగా "బాబా ముద్ర" కావాలని కోరినప్పటికీ ఎన్నికల కమిషన్ ఆయనకు "ఆటో గుర్తు"ను కేటాయించినట్టు సమాచారం. గతంలో సైకిల్ గుర్తును కేటాయించినట్టు వార్తలు వచ్చినప్పటికీ తాజా సమాచారం ప్రకారం ఆటో గుర్తును కేటాయించినట్టు స్పష్టమైంది. ఇక రజినీ కాంత్ పార్టీ గుర్తు, పేరు ఖరారు కావడంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

రజినీకి ఆటో గుర్తు సెంటిమెంట్ అని తప్పకుండా ఎన్నికల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమిళ యంగ్ హీరో విశాల్ కూడా తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చెన్నై లోని ఆర్కే నగర్ నియోజకవర్గం నుండి విశాల్ పోటీకి దిగేందుకు సిద్దమౌతున్నట్టు తెలుస్తోంది.అంతే కాకుండా ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా తమిళ నాడు ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమౌతున్నారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ సోషల్ మీడియాలో ప్రకటించారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని పోటీ చేసే నియోజకవర్గాన్ని త్వరలోనే ప్రకటిస్తానని అన్నారు.    

More Related Stories