English   

నటి చిత్ర సూసైడ్ కేసు..ఆ సీన్లలో నటించినందుకే

Tamil Actor Chitra
2020-12-15 12:21:55

ఈనెల 9న తమిళ నటి విజే చిత్ర చెన్నైలోని ఓ హోటల్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో పోలీసులు చిత్రకు కాబోయే భర్త హేమంత్ కుమార్ ను అరెస్ట్ చేశారు. అనంతరం అరెస్ట్ చేయడానికి గల కారణాలను వెల్లడించారు. ఐపీసీ సెక్షన్ 306 కింద హేమంత్ పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. విజే చిత్ర ఆత్మహత్యకు పాల్పడేలా హేమంత్ వ్యవహరించినట్టు పోలీసులు వెల్లడించారు. సినిమాలతో పాటు కొన్ని సీరియళ్లలో చిత్ర అభ్యంతకరమైన సన్నివేశాల్లో నటించడంపై హేమంత్ అనుమానం వ్యక్తం చేశారు. చిత్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కారణంగానే చిత్ర ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఆత్మహత్య చేసుకున్న రోజు కూడా ఇద్దరిమధ్య హోటల్ లో ఘర్షణ జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యకు పాల్పడిన రోజు చిత్ర షూటింగ్ ముగించుకున్న అనంతరం హేమంత్ తో ఫోన్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. మొదట చిత్ర ఆత్మహత్య పై అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు కుటుంబ సంబంధాలపై విచారణ జరిపారు. దాంతో హేమంత్ తో కొన్ని రోజులుగా చిత్రకు సత్సంబంధాలు లేవని గుర్తించారు. హేమంత్ ను విచారించగా చిత్రకు ఆర్థిక లావాదేవీలకు సంబందించిన ఎలాంటి కారణాలు లేవని..హేమంత్ వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఏసీపీ పేర్కొన్నారు. దాంతో అతడిపై ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదుచేశామన్నారు.

More Related Stories