English   

బిగ్‌బాస్ బ్యూటీ మోనల్ కి గట్టిగానే ముట్టింది

Monal gajjar
2020-12-15 12:41:09

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా రన్ అవుతూ మంచి రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పారితోషికాలు సహజంగా బయటకు తెలియదు. వారు కూడా చెప్పకూడదు అనేది ఒక రూల్ ఉంటుంది. కాని అనధికారికంగా మాత్రం తెలుస్తూ ఉంటాయి.బిగ్ బాస్ సీజన్ 4లో గ్లామరస్ కంటెస్టెంట్‌గా మోనల్ అలరించింది. 14 వారాల పాటు బిగ్ బాస్ ఇంట్లో కొనసాగి.. ఫినాలేకు వారం దూరంలో ఎలిమినేట్ అయ్యింది.  

ఇదిలా ఉంటే, బిగ్ బాస్ టైటిల్ గెలిచిన వాళ్లకు రూ.50 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు. వాస్తవానికి ఇది బోనస్ లాంటిది. ఎందుకంటే ఈ షోలో పాల్గొనడానికి కంటెస్టెంట్లకు రెమ్యునరేషన్ ఉంటుంది.  మోనాల్ కు వారంకు 2.5 లక్షల పారితోషికం ఇచ్చి ఉంటారు అనేది సమాచారం.14 వారాలకు కలిపి ఆమె ఇంచుమించుగా రూ.30 లక్షలు ఇంటికి తీసుకెళ్లారని టాక్. ఇప్పుడు హౌస్ లో ఉన్న వారిలో అభిజిత్ కు వారంలో రూ.2 నుంచి రూ. 2.5 లక్షల వరకు పారితోషికం ఇచ్చే అవకాశం ఉంది. మరి ఈ వదంతుల్లో నిజమెంతో తెలీదు కానీ.. ప్రస్తుతానికి అయితే ఇదే హాట్ టాపిక్. 

More Related Stories