శివాని రాజశేఖర్...డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ తన తదుపరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి కూడా డిఫరెంట్ థ్రిల్లర్‌తో వస్తున్నారు. ఈ చిత్రానికి ‘WWW’ (హూ, వేర్, వై) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి. రాజు దట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో ఈ చిత్రం టైటిల్ లోగోను విడుదలచేయనున్నారు.
సినిమా టైటిల్‌ను ప్రకటించిన సందర్భంగా నిర్మాత డా. రవి పి.రాజు దట్ల మాట్లాడుతూ.. ‘‘కేవీ గుహన్ గారు తెరకెక్కించిన ‘118’ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన రెండో చిత్రంగా ఒక డిఫరెంట్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో వస్తున్నారు. దీనికి ‘WWW’ అనే టైటిల్ ఖరారు చేశాం. రామంత్ర క్రియేషన్స్ బ్యానర్లో హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ మూవీ రూపొందుతోంది. సిమన్ కె. కింగ్ సంగీత సారథ్యం వహిస్తుండగా మిర్చికిరణ్ పవర్ఫుల్ డైలాగ్స్ అందించారు. టెక్నికల్‌గా మంచి టీమ్ కుదిరింది. త్వరలోనే టైటిల్ లోగోని విడుదలచేస్తాం’’ అని అన్నారు.