English   

గాలి సంపత్ వైజాగ్ షెడ్యూల్ పూర్తి 

Gaali Sampath
2020-12-16 11:54:41

శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా గాలి సంపత్. ఈ సినిమాలో రాజేంద్ర ‌ప్ర‌సాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం .. గాలి సంపత్ వైజాగ్ షెడ్యూల్ పూర్తయిందని చిత్రబృందం వెల్లడించింది. టోటల్ సినిమా షూట్ 80శాతం పూర్తయింది. అరకు షెడ్యూల్ లో రాజేంద్ర ప్రసాద్, హీరో శ్రీ విష్ణు తో పాటూ సినిమాలో ముఖ్య తారాగణం మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పటికే విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సినిమా మీద మంచి అంచనాలు క్రియేట్ చేసింది. తండ్రీ కొడుకుల మధ్య ముందెన్నడూ చూడని ఒక డిఫరెంట్ ఎమోషన్ తో అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్ మెంట్ తో  ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీని ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బేన‌ర్‌ పై ఎస్‌. క్రిష్ణ, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై మజిలీ వంటి హిట్ చిత్రాలు నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి నిర్మిస్తున్నారు. ఎస్. క్రిష్ణ ప‌టాస్ నుండి స‌రిలేరు నీకెవ్వ‌రు వ‌ర‌కూ అనిల్ రావిపూడి అన్ని చిత్రాల‌కు కో డైరెక్ట‌ర్, రైట‌ర్ గా వ‌ర్క్ చేశారు. ఇప్పుడు మొదటిసారి నిర్మాతగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తూ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు నటిస్తున్నారు.

More Related Stories